ప్రిన్స్ ఫిలిప్ కారు ప్రమాదం: ఈబేలో ఫొటోల అమ్మకం

ఫొటో సోర్స్, Reuters
బ్రిటన్ రాణి ఎలిజెబెత్ II భర్త, ప్రిన్స్ ఫిలిప్ కారు గురువారం నాడు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాద స్థలంలో తీసినదిగా చెబుతున్న ఫొటోను ఓ వ్యక్తి ఈకామర్స్ వెబ్‌సైట్ ఈబేలో అమ్మకానికి పెట్టారు.
97 ఏళ్ల వయసున్న ప్రిన్స్ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బకింగ్‌హాం ప్యాలెస్ దగ్గర లాండ్ రోవర్ కారు నడుపుతుండగా ఆ ప్రమాదం జరిగింది. అందులో ప్రిన్స్ ఫిలిప్‌కు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.
అయితే, కారు అద్దాల పెంకులు కనిపిస్తున్న ఓ ఫొటోను Seller morbius777 పేరుతో ఈబేలో ఖాతా కలిగిన వ్యక్తి ఆ వెబ్‌సైట్‌లో వేలానికి పెట్టారు.
"దాని మీద ప్రిన్స్ ఫిలిప్ డీఎన్‌ఏ ఉండవచ్చు. మీరు ఆయనను క్లోన్ చేయాలనుకుంటే దీన్ని తీసుకోండి" అని రాశారు.

ఫొటో సోర్స్, Ebay
ఈ వేలం ద్వారా 65,900 పౌండ్లు (రూ. 60,47,120) సేకరించి 'కేన్సర్ రీసెర్చ్ యూకే' అనే కేన్సర్ పరిశోధనా సంస్థకు విరాళంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అయితే, తర్వాత ఈబే నుంచి ఈ ప్రకటనను తొలగించారు.
తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ పోస్టును తొలగించామని ఈబే ప్రతినిధి వెల్లడించారు.

ఫొటో సోర్స్, ARCHANT
ఆ రోజు ప్రిన్స్ ఫిలిప్ నడుపుతున్న లాండ్ రోవర్ కారు, మరో కారు ఢీకొన్నాయి. రెండో కారులో ఉన్న 9 నెలల బాలుడు, ఆ కారు నడుపుతున్న 28 ఏళ్ల మహిళ, మరో 45 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు గాయపడ్డారు.
అమ్మకానికి పెట్టిన ఫొటోలో మూడు ప్లాస్టిక్ విడిభాగాలు ఉన్నాయని, గ్లాస్ కాదని ఈబే తెలిపింది.

ఫొటో సోర్స్, ALBANPIX
"ఈ విడిభాగాలను ఎవరూ ఎత్తుకుపోలేదు. ఇన్ని రోజులూ ఇంకా రోడ్డు పక్కనే ఉన్నాయి" అని వాటిని అమ్మకానికి పెట్టిన వ్యక్తి ఈబేలో పేర్కొన్నారు. "డబ్బులు సంపాదించాలని నేను ఇలా చేయట్లేదు. దీని ద్వారా వచ్చే డబ్బులన్నీ చారిటీకి వెళ్తాయి" అని రాశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























