హవానా విమాన ప్రమాదం: 100 మందికిపైగా మృతి

ఫొటో సోర్స్, Getty Images
క్యూబాలోని జోస్ మార్టి విమానాశ్రయానికి సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. ఇందులో 100 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు.
ముగ్గురు ఈ ప్రమాదం నుంచి బయటపడినా.. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఇక్కడి కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక గ్రాన్మా వెల్లడించింది.
బోయింగ్ 737 విమానం 110 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయల్దేరింది. వీరిలో ఆరుగురు సిబ్బంది మెక్సికన్లు కాగా.. తక్కిన ప్రయాణికులంతా క్యూబాకు చెందిన వారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రమాద స్థలాన్ని సందర్శించిన క్యూబా అధ్యక్షుడు మిగుల్ దియాజ్ కానల్ ''ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరం'' అని చెప్పారు.
ఇది క్యూబాలోని హోల్గుయిన్ సిటీ నుంచి వస్తున్నట్లు స్థానిక టీవీ వెల్లడించింది.
మెక్సికోకు చెందిన ఎయిర్ లైన్స్ డెమో అనే కంపెనీ ఈ విమానాన్ని క్యూబానా డె ఏవియేషన్ లీజుకు ఇచ్చింది.
ఈ విమానాన్ని 1979లో తయారు చేశారని.. గతేడాది నంవంబరులో దీన్ని పరిశీలించారని మెక్సికో అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























